కరోనా వైరస్ లు, ఒకపెద్ద వైరస్ ల కుటుంబం. అవి కలుగ చేసే వ్యాధులు, సాధారణ జలుబు మొదలుకొని, అత్యంత తీవ్రమైన మిడిల్ ఈస్ట్ రెస్పిరేటరీ సిండ్రోమ్(MERS), మరియు సివియర్ ఎక్యూట్ రెస్పిరేటరీ సిండ్రోమ్ (SARS) వరకు విస్తరించి ఉంటాయి.
ఒక సరి క్రొత్త కరోనా వైరస్ (కోవిడ్ - 19) ను, చైనా లోని, ఊహాన్ లో 2019 లో కనుగొన్నారు. ఇది క్రొత్త కరోనా వైరస్. గతం లో దీనిని మనుషులలో ఎప్పుడూ కనుగొనటం జరగ లేదు.
ఈ కోర్స్, కోవిడ్ - 19 గురించి మరియు క్రొత్తగా వస్తున్న స్వాస కోశ వైరస్ ల గురించి ఒక పరిచయం చేస్తుంది. ఈ కోర్స్, ప్రజారోగ్య సంబంధిత వృత్తి లో వున్న వారిని, ఇన్సిడెంట్ (సంఘటన) నిర్వాహకులను, ఐక్య రాజ్య సమితి కోసం పనిచేస్తున్న వారిని, అంతర్జాతీయ సంస్థలు మరియు ఎన్.జి.ఓ. లను ఉద్దేశించినది.
అఫీషయల్ గా పేరు , ఈ మెటీరియల్ తయారయిన తర్వాత ఇవ్వడం జరిగినది కావున, nCoV అని ఎక్కడ ఉన్నా, అది ఈ మధ్యనే కనుగొన్న కరోనా వైరస్ వలన కలిగే వ్యాధి కోవిడ్ - 19 గానే పరిగణించాలి.
దయచేసి ఈ కోర్సు యొక్క కంటెంట్ ప్రస్తుతం ఇటీవలి మార్గదర్శకాలను ప్రతిబింబించేలా సవరించబడుతుందని గమనించండి. మీరు ఈ క్రింది కోర్సులలో నిర్దిష్ట COVID-19-సంబంధిత అంశాలకు సంబంధించిన అప్‌డేట్ సమాచారాన్ని కనుగొనవచ్చు:
టీకా: COVID-19 వ్యాక్సిన్‌ల ఛానెల్
IPC చర్యలు: COVID-19 కొరకు IPC
యాంటిజెన్ రాపిడ్ డయాగ్నస్టిక్ టెస్టింగ్: 1) SARS-CoV-2 యాంటిజెన్ రాపిడ్ డయాగ్నస్టిక్ టెస్టింగ్; 2) SARS-CoV-2 యాంటిజెన్ RDT ఇంప్లిమెంటేషన్ కొరకు ముఖ్య పరిగణనలు